రూ.8.21 లక్షల కోట్ల అప్పున్నా..  ఒకటో తేదీనే జీతాలు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

రూ.8.21 లక్షల కోట్ల అప్పున్నా..  ఒకటో తేదీనే జీతాలు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  • నెలకు వెయ్యి కోట్ల దాకా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తున్నాం
  • ఎస్టీఎఫ్ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం వదిలివెళ్లినప్పటికీ, ప్రజాప్రభుత్వం ప్రతి నెలా రూ.6,500 కోట్ల రుణ చెల్లింపులు చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో నెలలో 12, 14, 15 తేదీలకు కూడా జీతాలు అందని పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. గతంలో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను సైతం దశలవారీగా నెలకు రూ.750 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు వివరించారు.

క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డు సదుపాయాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. ఆదివారం ఖైరతాబాద్ ఇంజనీరింగ్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎఫ్) రాష్ట్ర విద్యా మహాసభలకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. 

ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన సర్వేలో విద్య ద్వారానే పౌరులు, కుటుంబాలు, సమాజం గణనీయంగా అభివృద్ధి చెందగలవని స్పష్టమైందని తెలిపారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ టీచర్ల  సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. వేలాది మంది టీచర్లకు పెండింగ్ పదోన్నతులు కల్పించడంతో పాటు సుమారు 11 వేల పోస్టులను భర్తీ చేశామని, 35 వేల మందికి బదిలీలు చేపట్టామని వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు వైద్య భద్రత కోసం క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డు తీసుకొచ్చామని పేర్కొన్నారు. 

గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేంజర్లుగా యంగ్ ఇండియా, పబ్లిక్ స్కూళ్లు

ప్రభుత్వ విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను తీసుకొస్తున్నామని, ఇవి విద్యారంగంలో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేంజర్లుగా నిలుస్తాయని భట్టి చెప్పారు. వాటిలో విద్య, వసతి, క్రీడలతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి నివాస వసతులు కల్పిస్తున్నామన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు వేర్వేరు గురుకులాలు ఉండేవని, చిన్నతనం నుంచే పిల్లలను విభజించే విధానాలకు బదులుగా కుల, వర్గ విభేదాలు లేకుండా అందరూ ఒకే ప్రాంగణంలో చదువుకోవాలనే ఉద్దేశంతో వీటిని తెచ్చామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం విభిన్న రకాల టిఫిన్స్, పాలు, ప్రత్యామ్నాయ రోజుల్లో రాగిజావ అందిస్తున్నామని భట్టి వివరించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ చార్జీలను 40 శాతం, కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచామన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇప్పటివరకు 8 లక్షల ఇళ్లకు అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. 

సామాజిక పరివర్తనకు టీచర్లే మార్గదర్శకులు

టీచర్లు విద్యాబోధనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి కుటుంబాలకు చేరేలా సలహాలు, సూచనలు ఇవ్వాలని భట్టి కోరారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో ఇదే సామాజిక దృక్పథంతో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎఫ్ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. టీచర్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా సామాజిక పరివర్తనకు మార్గదర్శకులుగా ఎదగాలని వివరించారు. ఈ మహాసభలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, ప్రధాన కార్యదర్శి పోచయ్య, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు పాల్గొన్నారు.